శేఖర్రెడ్డి కేసు సీబీఐకి..!

12 Dec, 2016 14:29 IST|Sakshi
ఏపీ సీఎం చంద్రబాబుతో శేఖర్‌రెడ్డి

చెన్నైలో రెండోరోజూ కొనసాగిన సోదాలు
రూ.170 కోట్ల నగదు, 130 కిలోల బంగారం స్వాధీనం

 సాక్షి ప్రతినిధి, చెన్నై/ న్యూఢిల్లీ: చెన్నైకి చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగారుు. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డికి చెందిన చెన్నై, వేలూరు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై గురువారం నుంచి రెండురోజుల పాటు జరిగిన దాడుల్లో మొత్తం రూ.170 కోట్ల నగదు, 130 కిలోల బంగారం పట్టుబడినట్లు సమాచారం. కాగా చెన్నైలోని వివిధ ప్రాంతా ల్లో జరిపిన దాడుల్లో లెక్కల్లోకి రాని రూ.142 కోట్లకు పైగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసు ను ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సీబీఐ డీఐజీ తేన్‌మొళి నేతృత్వంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. నగదు అక్రమ రవా ణా, అవినీతి కోణంలో తదుపరి విచారణ కొనసాగించేందుకు ఈ కేసు వివరాలన్నిటినీ తాము ఈడీ, సీబీఐలకు ఇస్తామని ఢిల్లీలోని ఐటీ విభాగం చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది. డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలను పూర్తిస్థారుు లో పరిశీలించిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉన్నాయంది. పట్టుబడిన నగదు, బంగారం తనదేనని శేఖర్‌రెడ్డి పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపారుు.

ఆరు నెలలుగా నిఘా...
2014లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంచి పలుకుబడి కలిగి ఉండటంమే కాకుండా అధికార తెలుగుదేశం పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న శేఖర్‌రెడ్డితో పాటు ఇతరుల కార్యకలాపాలను నిఘా వర్గాలు సుమారు ఆరు నెలల పాటు పరిశీలించినట్టు తెలుస్తోంది. సెల్‌ఫోన్ సంభాషణలను రికార్డు చేశారని సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, శేఖర్‌రెడ్డి హైదరాబాద్ వచ్చిన ప్పుడు ఒక ప్రముఖ హోటల్‌లో టీడీపీ ముఖ్య నేతతో భేటీ అవుతారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు  ఆయనను టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమించారని చెబుతు న్నారు.   శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు కాట్పాడిలో సీల్ చేసిన శేఖర్‌రెడ్డి ఇంటిని తనిఖీ చేసి వెళ్లారు. ఆయన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


చెన్నైలోని శేఖర్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సీజ్ చేసిన నగదు, బంగారం.

>
మరిన్ని వార్తలు