లాటరీ టికెట్లపై ఐటీ దాడుల కలకలం

5 May, 2019 10:20 IST|Sakshi

ఐటీ దాడులతో వెలుగులోకి కట్టలు..కట్టలుగా నోట్లు

క్యాషియర్‌ మరణంలో మిస్టరీ 

సాక్షి, చెన్నై: లాటరీ టికెట్ల టైకూన్‌పై ఐటీ అధికారుల దాడులు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. గత నాలుగు రోజులుగా కోయంబత్తూరులోని మార్టీన్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు రహస్య అరలనుంచి కట్టల కొద్ది నగదు పట్టుబడింది. చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఏకకాలంలో 70 చోట్ల తనిఖీలు నిర్వహించారు. లాటరీ టికెట్ల టైకూన్‌ మార్టీన్‌ కార్యాలయాలు, నివాసాలపై దాడులు జరపగా..రూ.595 కోట్ల విలువైన లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ప్రశ్నిస్తున్న అధికారులు.. లెక్కకు రాని మరో 619 కోట్ల రూపాయల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూ. 24.57 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా.. వందల కోట్ల విలువైన దస్తావేజులను గుర్తించారు.క్యాషియర్‌ మరణంలో అనుమానాలు
ఐటీ దాడుల నేపథ్యంలో లాటరీ మార్టిన్‌ కార్యాలయంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న పళని స్వామి మృతదేహం ఓ చెరువులో లభించడం కలకలం రేపింది. ఐటీ వర్గాలు కోయంబత్తూరుకు చెందిన పళనిస్వామి వద్ద సైతం విచారణ జరిపినట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం మేట్టుపాళయం సమీపంలోని వెల్లంకాడు చెరువులో పళనిస్వామి మృతదేహంగా తేలడం అనుమానాలకు దారి తీశాయి. ఈ మృత దేహాన్ని కోయంబత్తూరు మార్చురీలో ఉంచారు. తన తండ్రి మరణం మీద పళని స్వామి కుమారుడు రోహిన్‌ కుమార్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రి పనిచేస్తున్న కార్యాలయంలో ఉన్న ఇద్దరిపై తనకు అనుమానాలు ఉన్నాయని, నిర్ధారణ అయ్యాక వారి పేర్లను బయటపెడతానని వ్యాఖ్యానించాడు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు. కాగా, రోహిన్‌ కుమార్‌ పేర్కొంటూ, తన తండ్రి మృత దేహం మార్చురీలో ఉందని, సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారని, కొందరు పోలీసులు పని గట్టుకుని రావడం, వెల్లడం వంటివి జరుగుతుండడం తన అనుమానాలకు బలాన్ని కల్గిస్తున్నట్టు పేర్కొన్నాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్‌?

పొలంలో రైతు మృతదేహం

యోగికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

హిందీలో తెలుగు ఎంపీల ప్రమాణం

ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణం

విపక్షాలు బాధ పడొద్దు: ప్రధాని మోదీ

బూటు కాలితో తంతూ.. రోడ్డు మీద లాక్కెళ్తూ

వైఎస్సార్‌సీపీ ఎంపీల భేటీ

బయటపడితే మ్యాజిక్‌.. లేదంటే ట్రాజిక్‌

ఎంపీలకు 400 కొత్త ఇళ్లు

చంద్రయాన్‌–2 ప్రయోగానికి ప్రధాని రాక?

కశ్మీర్‌లో అలజడికి ఉగ్ర కుట్ర

బీజేపీతో జేడీయూ కటీఫ్‌?

మెత్తబడ్డ ప్రభుత్వ వైద్యులు

2022 యూపీ ఎన్నికలపై ప్రియాంక గురి!

కాంగ్రెస్‌ పక్ష నేత నియామకం సందిగ్ధం

జమిలి ఎన్నికలపై 19న అఖిలపక్ష భేటీ

సాగు సంక్షోభం .. నిరుద్యోగం

మిస్‌ ఇండియాగా సుమన్‌ రావ్‌

టిక్‌టాక్‌ తీసిన ప్రాణాలెన్నో...

‘ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాం’

మా వ్యవహారాల్లో మీ జోక్యం వద్దు..

కీలక నిర్ణయంపై మరోసారి అఖిలపక్షం భేటీ

బెంగాల్‌లో కొనసాగుతున్న జూడాల ఆందోళన

‘నన్ను కూడా చంపండి’

చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు

కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత ఎన్నికపై ఉత్కంఠ

జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్‌..!

సీఎల్పీ మాజీనేతకి మంత్రిపదవి

నాన్న ఇల్లు అమ్మి.. రైఫిల్‌ కొనిచ్చాడు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

గర్జించే టైమ్‌ వచ్చింది!