బెంగాల్‌ వీధుల్లో కొత్త రామాయణం

6 Apr, 2017 13:01 IST|Sakshi
బెంగాల్‌ వీధుల్లో కొత్త రామాయణం

కోల్‌కతా: శ్రీరామ నవమి వేళ పశ్చిమ బెంగాల్‌ వీధుల్లో కొత్త రామాయణం దర్శనం ఇచ్చింది. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పోటాపోటీగా రామ నవమి వేడుకలు జరిపించారు. అయితే, శ్రీరాముడికి ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంతుడికి మధ్య పోటీ పెట్టినట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. బీజేపీ పార్టీ నేతలు శ్రీరామ నవమి ఉత్సవం నిర్వహించగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం ఒక్క హనుమంతుడికి మాత్రమే పండుగ నిర్వహించారు.

రెండు పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చారు. శ్రీ రామ్‌ అంటూ వారు, జై హనుమాన్‌ అంటూ వీరు చూస్తున్నవాళ్లంతా ఔరా అనుకునేలా ఈ వేడుకలు జరిపారు. బీజేపీ నిర్వహించే వేడుకల్లో ఆరెస్సెస్‌ కూడా తోడై, వారి కార్యకర్తలు కూడా చేరి వీధుల్లో కాషాయ జెండాలతో బారులు తీరి నినాదాలు చేస్తుండగా.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం ప్రత్యేకంగా ఆయా నివాసాల నుంచి పలువురుని తీసుకొచ్చి పలు చోట్ల హనుమాన్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.

దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పెద్ద మొత్తంలో భద్రతను మోహరించారు. హిందూ సాంప్రదాయ ఆయుధాలతో ఎస్పీ నివాసం ముందు నుంచే పెద్ద మొత్తంలో ర్యాలీ ప్రారంభించారు. భారీ ఎత్తున నినాదాలు చేస్తూ టాపాసులు కాలుస్తూ రంగులు చల్లుకుంటూ చిందులేస్తూ సందడి చేశారు. దీనిపై పోలీసులు అడ్డు చెప్పగా మొహర్రం రోజున ముస్లింలు ఆయుధాలతో జరుపుకోవడం లేదా మేం చేస్తే తప్పేమిటంటూ 24వ పరగాణాల బీజేపీ అధ్యక్షుడు శంకర్‌ ఛటర్జీ అన్నారు.

మరిన్ని వార్తలు