'సర్జికల్‌ దాడులు మోదీ ధైర్యమైన నిర్ణయం'

29 Sep, 2017 19:30 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఆర్మీ మాజీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌

న్యూఢిల్లీ : భారత్‌ 2015లో ఒకసారి, 2016లో ఒకసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించిందని భారత ఆర్మీ మాజీ చీఫ్‌ అధికారి జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ చెప్పారు. ఈ రెండు దాడుల్లో కూడా ఘనమైన విజయం సొంతం చేసుకుందని, భారత్‌ ప్రతిష్ట అమాంతం పెరిగిందని తెలిపారు. 2015 జూన్‌ నెలలో తొలుత మ్యాన్‌మార్‌లో, 2016 సెప్టెంబర్‌ నెలలో పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లి విజయవంతంగా సర్జికల్‌ దాడులు చేసినట్లు వివరించారు.

'ఈ రెండు సర్జికల్‌ దాడులతో భారత ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగింది. మన సైనికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ రెండు దాడులు విజయవంతం అయ్యాయి. ఇది ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం. ఆ సర్జికల్‌ దాడుల తర్వాత ఎలాంటి సంఘటన చర్చించుకోదగినది లేదు' అని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు