కశ్మీర్‌ అధికారులకు కీలక ఆదేశాలు

8 Aug, 2019 19:18 IST|Sakshi

ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కీలక ఆదేశాలు

ఆగస్టు 9 నుంచి  విధులకు హాజరు కావాలని ప్రభుత్వ  ఉద్యోగులకు ఆదేశాలు

ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలు యథావిధిగా పని ప్రారంభించాలి

జమ్మూ  కశ్మీర్‌  స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.  జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి గురువారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్నిస్థాయిల ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే విధులకు హాజరు కావాల్సి ఉంది. డివిజనల్, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సెక్రటేరియట్ శ్రీనగర్లో పనిచేస్తున్న ఇతర వారందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే  రేపు (ఆగస్టు 9) సాంబాలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలను రీ ఓపెన్‌ చేయాలని, కార్యక్రమాలను యధావిధిగా పునః ప్రారంభించాలని  జిల్లా యంత్రాంగం ఆదేశించింది. 

మరోవైపు  జమ్మూ  కశ్మీర్‌ పునర్విభజన బిల్లు ఆమోదం తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (ఆగస్టు 8)  దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.  నోట్ల రద్దు  2016, నవంబరు 8వ తేదీన ప్రకటించిన మోదీ, ఆగస్టు 8వ తేదీన సరిగ్గా ఎనిమిది గంటలకు తన కీలక ప్రసంగాన్ని చేయనున్నారు.  ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు ప్రతిపాదన, పార్లమెంటు ఆమోదం లాంటి పరిణామాలను చకాచకా చక్కబెట్టిన మోదీ సర్కార్‌ మరింత వేగంగా తదనంతర చర్యలను పూర్తి చేయాలని  పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు