కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం

16 Sep, 2017 14:18 IST|Sakshi
కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో భారత్‌లో అంతర్భాగమని.. అందులో ఎటువంటి సందేహం లేదని భారత విదేశాంగ శాఖ శనివారం మరోసారి స్పష్టం చేసింది. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ (ఓఐసీ) గత వారంలో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ అటు ఓఐసీ, పాకిస్తాన్‌కు సూటిగా సమాధానమిచ్చింది. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం.. మా దేశానికి సంబందించిన అంతర్గత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఒక వేళ అలా జోక్యం చేసుకుంటే తగిన సమాధానం చెబుతామని ప్రకటించింది.

కశ్మీర్‌ విషయంలో ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సమాజాన్ని పక్కదోవ పట్టించేలా ఓఐసీ వ్యాఖ్యలు ఉన్నాయని.. సమితిలో భారత కార్యదర్శిగా పనిచేస్తున్న సుమిత్‌ సేథ్‌ చెప్పారు. ఓఐసీ వ్యాఖ్యలను భారత్‌ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. ఓఐసీ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఖరాఖండీగా చెప్పారు. ఎల్‌ఓసీ వద్ద నిత్యం కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్‌కు.. సైన్యం బుద్ధి చెబుతోందని అన్నారు.  

 

మరిన్ని వార్తలు