ఇంటి విద్యుత్ బిల్లు 39కోట్లు

23 Nov, 2015 09:31 IST|Sakshi
ఇంటి విద్యుత్ బిల్లు 39కోట్లు

జమ్మూ: రూ.39 కోట్ల విద్యుత్ బిల్లు. ఇది ఏ కంపెనీకో, ఫ్యాక్టరీకో ఏడాది కాలానికి వచ్చిన బిల్లు కాదు. ఓ కుటుంబానికి అక్టోబర్ నెలకు వచ్చింది. జమ్మూలోని పవర్ డవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (పీడీడీ) చేసిన నిర్వాకమిది.

జమ్మూలోని పురాణ్ నగర్‌లో నివసించే రామ్ కృష్ణన్‌కు అక్టోబర్ నెల విద్యుత్ బిల్లు వచ్చింది.  రూ.39 కోట్ల విద్యుత్ బిల్లు చూసి కృష్ణన్ నిర్ఘాంతపోయాడు. సాఫ్ట్‌వేర్‌లో ఏదో సమస్య తలెత్తిందని, సమస్యను పరిష్కరిస్తామని తర్వాత పీడీడీ అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు