ఆ ట్రెండ్‌ సెట్‌ చేసింది మోదీనే!

3 Nov, 2018 13:58 IST|Sakshi

జేడ్‌బ్లూ లైఫ్‌స్టైల్‌ ఇండియా ఎండీ బిపిన్‌ చౌహాన్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు పంపించిన మోదీ జాకెట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ చేసిన ట్వీట్‌ నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. నెహ్రూ మార్కు జాకెట్లను మోదీ జాకెట్‌ అని సంబోధించడమేంటని కొందరు విరుచుకు పడుచుతుంటే మరికొంత మంది మాత్రం మోదీ వల్లే వాటికి ప్రత్యేకత సంతరించిందని మరికొందరు వాదిస్తున్నారు. కాగా ఈ విషయంపై జేడ్‌బ్లూ లైఫ్‌స్టైల్‌ ఇండియా ఎండీ బిపిన్‌ చౌహాన్‌ స్పష్టతనిచ్చారు.

‘నిజానికి వీటిన బంధ్‌గాలా అంటారు. ఒకప్పుడు నెహ్రూ, సర్దాన్‌ వల్లభబాయ్‌ పటేల్‌ వీటిని విరివిగా ధరించేవారు. ముఖ్యంగా నెహ్రూజీ బ్లాక్‌, హాఫ్‌ వైట్‌ షేడ్‌ జాకెట్లు మాత్రమే ధరించేవారు. అయితే గత కొన్నేళ్లుగా వివిధ రంగుల జాకెట్లు ధరిస్తూ.. మోదీజీ ఓ కొత్త ట్రెండ్‌ సృష్టించారు. వాటిని ప్రస్తుతం మోదీ జాకెట్లు అనే పిలుస్తున్నాం. మన ప్రధాని తరపున దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆ కోట్లు పంపింది మేమేనని’  చౌహాన్‌ పేర్కొన్నారు.

మోదీ అంటే ఖాకీ నిక్కరు మాత్రమే..
మూన్‌ జే ఇన్‌ ట్వీట్‌పై స్పందించిన కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా.. ‘ మన ప్రధాని చాలా మంచి పనిచేశారు. కానీ ఆ వస్త్రాల పేరు మార్చకుంటే బాగుండేది. నాకు తెలిసి వాటిని నెహ్రూ జాకెట్లు అంటారు. కానీ ఇపుడు మోదీ జాకెట్లు అని పిలవడం చూస్తుంటే.. 2014 ముందటి భారత్‌ చరిత్రను మార్చివేసేలా ఉన్నారంటూ’  పేర్కొన్నారు. ’ మీరు మాట్లాడింది తప్పు. అవి నెహ్రూ జాకెట్లు. మాకైతే మోదీ అంటే ఖాకీ నిక్కరు మాత్రమే గుర్తుకు వస్తుంది’ అంటూ మరో నెటిజన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.




మరిన్ని వార్తలు