జైన గురువు తరుణ్‌ కన్నుమూత

2 Sep, 2018 05:01 IST|Sakshi

న్యూఢిల్లీ: జైన మత గురువు తరుణ్‌ మహరాజ్‌ (51) శనివారం ఢిల్లీలోని రాధాపురి జైన దేవాలయంలో  తుదిశ్వాస విడిచారు. ‘తరుణ్‌ మహరాజ్‌కు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదు. ఇటీవల రాధాపురి ఆలయానికి వచ్చి అక్కడే ఉంటున్నారు. తెల్లవారుజామున 3.18కి ఆయన మరణించారు’ అని భారతీయ జైన్‌ మిలాన్‌ సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘ఉదయం 6 గంటలకు ఆయన మరణ వార్త తెలిసింది. దీంతో దేవాలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది’ అని అన్నారు. తరుణ్‌ మహరాజ్‌ మృతిపై ప్రధాని మోదీ,  హోం మంత్రి రాజ్‌నాథ్‌ సంతాపం తెలిపారు.  కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మహరాజ్‌ మృతికి సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు