పదోన్నతి ‘పరుగు’లో కుప్పకూలాడు

16 Jun, 2018 12:48 IST|Sakshi
మరణించిన హెడ్‌ కానిస్టెబుల్‌ సుశీల్(ఫైల్‌ఫోటో)

జైపూర్‌, రాజస్ధాన్‌ : పదోన్నతి కోసం నిర్వహించిన పరుగు పందెం కాస్తా ఆ కానిస్టేబుల్‌ పాలిట శాపమైంది. పదోన్నతి గురించి కలలు కంటూ పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి గమ్యం చేరకుండానే అసువులు బాసాడు. విషాదాంతకరమైన ఈ సంఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న సుశీల్ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై) గా పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో జైపూర్‌ పోలీసు శాఖ శుక్రవారం అమీర్‌ రోడ్డులోని జల్‌మహల్‌లో పదోన్నతి కోసం నిర్వహించిన పరుగు పందెంలో సుశీల్ పాల్గొన్నాడు. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి, ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే సుశీల్‌ను సమీప ఎస్‌ఎమ్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే సుశీల్ మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు.

మరిన్ని వార్తలు