ముద్రా యోజనకు రూ.3 లక్షల కోట్లు

2 Feb, 2018 04:57 IST|Sakshi

న్యూఢిల్లీ: స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వరాల జల్లు కురిపించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ముద్రా పథకం కింద రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. 2015 ఏప్రిల్‌లో ప్రారంభించిన ముద్రా యోజన పథకం ద్వారా రూ.4.6 లక్షల కోట్ల రుణాలను ఇచ్చారు. ఈ పథకం కింద 10.38 కోట్ల మంది లబ్ధిపొందారు. రుణ ఖాతాలు ఉన్న వారిలో 76 శాతం మంది మహిళలు ఉండగా, 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారని జైట్లీ తెలిపారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన(పీఎమ్‌ఎమ్‌వై)లో శిశు, కిషోర్, తరుణ్‌ అనే పథకాల కింద రుణాలను ఇస్తారు.   

మరిన్ని వార్తలు