‘రాఫేల్‌పై రాహుల్‌ ప్రచారం బూటకం’

16 Dec, 2018 19:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాఫేల్‌ ఒప్పందంపై ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పుతో కాంగ్రెస్‌ రాద్ధాంతం తేటతెల్లమైందని ​కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ధ్వజమెత్తారు. భోఫోర్స్‌, రాఫేల్‌ ఒప్పందాలను ఒకటిగా చూపేందుకు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విఫలయత్నం చేశారని ఆరోపించారు. భోఫోర్స్‌ మాదిరిగా రాఫేల్‌లో దళారీలు లేవు, ముడుపులు లేవంటూ ముఖ్యంగా ఖత్రోచి లేరని ఎద్దేవా చేశారు.

రాఫేల్‌పై ఏకరువు పెట్టిన అసత్యాలన్నీ సుప్రీం కోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలాయని జైట్లీ ట్వీట్‌ చేశారు. ఒప్పందంపై స్వార్ధ ప్రయోజనాల కోసం చెప్పిన అవాస్తవాలు కల్పితాలేనని వెల్లడైందన్నారు. రాఫేల్‌పై రాహుల్‌ నిస్పృహతో చేసిన ఆరోపణలు విఫలయత్నంగా మారాయని ఆరోపించారు. రాఫేల్‌ను యూపీఏ ప్రభుత్వంలోనే షార్ట్‌లిస్ట్‌ చేశారని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు