రాళ్లు రువ్వి వర్సిటీలోకి వెళ్లారు

22 Feb, 2020 09:22 IST|Sakshi

జామియా హింసాత్మక ఘటన తాజా వీడియో

సాక్షి, న్యూఢిల్లీ: జామియా యూనివర్సిటీ వద్ద సీఏఏకు వ్యతిరేక ఆందోళనల సందర్భంగా డిసెంబర్‌ 15న జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా విడుదలైన వీడియో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు యూనివర్సిటీలోకి వెళ్లారు. లైబ్రరీ వద్దకు చేరుకున్నట్లు ఆ సీసీ కెమెరా వీడియోలు వెల్లడిస్తున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పావాయుగోళాలను ప్రయోగించారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’)

యూనివర్సిటీ వర్సిటీలోని ఓ భవనం వద్ద, భవనం లోపల భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థులు, ఆందోళనకారులు బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చారు. ముసుగులు ధరించిన వారు లైబ్రరీలోకి పారిపోయారు. అయితే, లైబ్రరీలోకి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టారని ఫిర్యాదు చేసిన విషయం విదితమే. (జామియాలో దాడి; కీలక వీడియో విడుదల)

తాజాగా విడుదల చేసిన ఈ వీడియో ద్వారా ఆందోళనకారులే ఆ లైబ్రరీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వినవారిని తరుముకుంటూ పోలీసులు వెళ్లారని అధికారులు చెబుతున్నారు. అయితే, లైబ్రరీలోకి వెళ్లలేదని చెప్పారు. యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి లేకుండా పోలీసులు ఏ యూనివర్సిటీలోకి వెళ్లలేరని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఎంఎస్‌ రంధ్వా తెలిపారు. 

కాగా, ఆ రోజున పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పావాయుగోళాలను ప్రయోగించడం.. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం జరిగింది. ఆందోళనకారులు మూడు బస్సులకు నిప్పుపెట్టారు. మరో రెండు ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. అయితే, పోలీసులు లైబ్రరీలోకి వచ్చి దాడి చేశారంటూ ఓ వీడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.  ఆందోళనల నేపథ్యంలో పదిమంది వర్సిటీ విద్యార్థులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు