‘జామియా’ లాఠీచార్జీ వీడియో లీక్‌

17 Feb, 2020 06:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.  జామియా సమన్వయ కమిటీ (జేసీసీ) విడుదల చేసిన ఈ వీడియోలో.. గత డిసెంబర్‌ 15న పారామిలటరీ, పోలీసు సిబ్బంది లైబ్రరీలో విద్యార్థులను కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.   48 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో 8 మంది భద్రతా సిబ్బంది పాత రీడింగ్‌ హాల్‌లోకి వచ్చి విద్యార్థులను కర్రలతో కొడుతున్నట్లు ఉంది. ఈ సందర్భంగా పారామిలటరీ, పోలీసు సిబ్బంది కనబడకుండా ఉండేందుకు ముఖాలకు చేతిరుమాలును కట్టుకున్నారు. ఈ వీడియోపై విచారణ జరుపుతున్నట్లు ప్రత్యేక పోలీస్‌ కమిషనర్‌ ప్రవీర్‌ రంజన్‌ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వర్సిటీలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం, పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి లాఠీచార్జీ చేయడం తెలిసిందే.

మరిన్ని వార్తలు