జమ్మూ కశ్మీర్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

29 Apr, 2020 11:12 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దక్షిణ కశ్మీర్‌ షోపియన్‌ జిల్లాలోని మెల్‌హురా ప్రాంతంలో మంగళవారం జరిగింది. మెల్‌హురా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో భద్రతా దళాలు, పోలీసులు కార్డన్ చెర్చ్ చేపట్టారు. దీంతో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు మంగళవారమే తెలిపారు. (చెన్నైలో భయం.. భయం)

ఇక ఈ ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా మృతి చెందగా.. మూడో ఉగ్రవాది కాల్పులు జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయినట్లు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఇక మూడో ఉగ్రవాది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతి చెందినవారు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు