జమ్మూ పేలుడు : నిందితుడికి హిజ్బుల్‌ సాయం

8 Mar, 2019 19:54 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ బస్‌స్టాండ్‌లోని ఓ బస్సుపై జరిగిన గ్రనేడ్‌ దాడిలో అరెస్ట్‌ అయిన అనుమానితుడు యాసిర్‌ భట్‌కు నిషేధిత ఉగ్ర సంస్థ హిజ్బుల్‌ ముజహిదిన్‌ రూ 50,000 ఇచ్చినట్టు వెల్లడైంది. గురువారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు మరణించగా, 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. కుల్గాం జిల్లాకు చెందిన అనుమానితుడు యాసిర్‌ భట్‌ను కశ్మీర్‌లోకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా జమ్మూ నగరం వెలుపల నాగ్‌రోటా టో్‌ల్‌ప్లాజా వద్ద అరెస్ట్‌ చేశారు.

నిందితుడి ఆధార్‌ కార్డు, స్కూల్‌ రికార్డులను పరిశీలించగా 16 ఏళ్ల మైనర్‌గా వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న నిందితుడి తండ్రి వృత్తిరీత్యా పెయింటర్‌. కాగా యాసిర్‌ భట్‌ను ఈ దాడికి ప్రేరేపించేందుకు హిజ్బుల్‌ ముజహిదీన్‌కు చెందిన ముజమిల్‌ అనే అజ్ఞాత సానుభూతిపరుడు రూ 50,000 చెల్లించడంతో పాటు గ్రనేడ్‌ను సమకూర్చాడని నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. వాస్తవంగా గ్రనేడ్‌ దాడిని ముజమిల్‌కు హిజ్బుల్‌ జిల్లా కమాండర్‌ ఫయాజ్‌ భట్‌ అప్పగించగా ఈ దాడిని చేపట్టంలో ముజమిల్‌ విఫలమయ్యాడని నిందితుడు విచారణలో భాగంగా తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు