ఎన్కౌంటర్లో జవాను మృతి

11 May, 2016 11:17 IST|Sakshi

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో బుధవారం జరిగిన  ఎన్కౌంటర్లో ఓ జవాను మృతి చెందాడు. కుప్వారా జిల్లా అటవీ ప్రాంతంలో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.  ఎదురుకాల్పుల  ఘటనలో ఓం వీర్ సింగ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మిలిటెంట్లు దాగి ఉన్నట్లు సమాచారంతో భద్రతా దళాలు నిన్నటి నుంచి హంద్వారా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగటంతో ప్రతిగా జవాన్లు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.

 

మరిన్ని వార్తలు