యశోదాబెన్ కూడా ఎస్పీజీ భద్రత

25 May, 2014 10:40 IST|Sakshi
యశోదాబెన్ కూడా ఎస్పీజీ భద్రత
భోపాల్: వాళ్లిద్దరూ దశాబ్దకాలంగా కలిసి ఉన్న దాఖలాలు లేవు. కాని కాబోయే దేశ ప్రధాని భార్య అనే హోదా మాత్రం ఆమెకు దక్కింది. ఆమె హోదాకు తగినట్టుగానే  భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
ఇదంతా కాబోయే ప్రధాని నరేంద్రమోడీ భార్య యశోదా బెన్ భద్రత గురించి. మోడీకి ఇచ్చే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను యశోదాబెన్ కు ఇవ్వాలని కల్పించనున్నారు.  
 
ప్రధాని కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను కేటాయించాలనే నిబంధన ఉందని.. ఆ చట్ట ప్రకారమే మోడీ భార్యతోపాటు ఇతర సభ్యులకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తున్నామని మధ్యప్రదేశ్ మాజీ పోలీస్ డైరెక్టరేట్ జనరల్ సుభాష్ చంద్ర పీటిఐకి వెల్లడించారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కు సుభాష్ చంద్ర సెక్యూరిటీ అధికారిగా సేవలందించారు. 
>
మరిన్ని వార్తలు