జస్టిస్‌ చలమేశ్వర్‌ భావోద్వేగం

12 Apr, 2018 11:48 IST|Sakshi
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ (పాత ఫొటో)

న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఏదో కార్యాలయాన్ని అధిరోహించడం కోసం తాను యత్నిస్తున్నట్లు కొందరు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఓ జాతీయ చానెల్‌తో చెప్పారు.

మరో రెండు నెలల్లో రిటైర్‌ అవుతాననగా ఇలాంటి వార్తలు రావడం బాధగా ఉందని అన్నారు. ఇలాంటి ఆరోపణలతో తాను రిటైర​కావాలనుకోవడం లేదని చెప్పారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు తిరస్కరించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల రీత్యా తాను ఈ పిల్‌ను విచారించలేనని జాస్తి పేర్కొన్నారు. తాను ఇచ్చిన తీర్పును 24 గంటల్లో మరోసారి మార్చబడకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు