'లుంగీ' వివాదంపై జయలలిత కన్నెర్ర!

17 Jul, 2014 12:17 IST|Sakshi
'లుంగీ' వివాదంపై జయలలిత కన్నెర్ర!
చెన్నై: 'లుంగీ' వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నెర్ర చేశారు. తమిళనాడు సంస్కృతికి వ్యతిరేకంగా జరిగే సంఘటనలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తామని జయలలిత హామీ ఇచ్చారు.
 
క్లబ్బు, రిసార్టులు, ఇతర సంస్థలు ఇలాంటి చర్యలకు దిగితే సహించేది లేదని జయలలిత వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. 
 
లుంగీ ధరించారనే కారణంతో మద్రాస్ హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులను తమ క్లబ్ లోకి అనుమతించకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం తమిళనాడును కుదిపేసింది. 
 
మరిన్ని వార్తలు