దశలవారీగా మద్యనిషేధం

10 Apr, 2016 02:01 IST|Sakshi
దశలవారీగా మద్యనిషేధం

చెన్నై: అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తే తమిళనాడులో మద్య నిషేధాన్ని దశలవారీగా అమలుచేస్తామని సీఎం జయలలిత ప్రకటించారు. చెన్నైలో శనివారం  పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె ఐలాండ్ గ్రౌండ్స్ సభలో ప్రసంగించారు. 1971లో మద్యనిషేధాన్ని ఎత్తివేసిన చరిత్ర కరుణానిధికి ఉందని జయ గుర్తు చేశారు. మొత్తం మద్య నిషేధాన్ని అమలు చేయాలన్నదే తన విధానమని, ఒక్క సంతకంతో అది సాధ్యం కాదన్నారు.  మొదట మద్యం విక్రయ షాపుల పనివేళలు తగ్గించి, తర్వాత దుకాణాల సంఖ్య తగ్గిస్తామన్నారు. అనంతరం మద్యం దుకాణాల అనుబంధ బార్లు మూతపడతాయన్నారు.    

 విజయ్‌కాంత్ కూటమిలోకి తమిళ మానిల
 తమిళనాడులో డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమితో తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) జట్టుకట్టింది. డీఎండీకే తనకు కేటాయించిన వాటిలో 20 సీట్లను టీఎంసీ కోసం త్యాగం చేసింది. విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే 104 సీట్లలో, ఎండీఎంకే పార్టీ 29 సీట్లలో పోటీచేస్తుంది. టీఎంసీ 29 ీసీట్లలో, సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు చెరో 25 చోట్ల పోటీ చేస్తాయి.

మరిన్ని వార్తలు