అక్టోబర్ 6 వరకూ జైల్లోనే జయలలిత

30 Sep, 2014 12:36 IST|Sakshi
అక్టోబర్ 6 వరకూ జైల్లోనే జయలలిత

బెంగళూరు :  అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్టోబర్ 6వ తేదీ వరకూ జైల్లోనే గడపాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణకు చేపట్టింది.

 

జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదోపవాదనలు విన్న  న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీ వరకూ వాయిదా వేసింది.  దాంతో జయ సోమవారం వరకూ జైల్లోనే ఉండాలి. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో పార్టీ కార్యకర్తలు నిరాశ చెందారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జయతో పాటు జైలు శిక్షకు గురైన శశికళ, సుధాకరన్, ఇళవరసిలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

మరిన్ని వార్తలు