జయలలిత ఆస్తులు జప్తు చేశాం: ఐటీ

26 Apr, 2019 03:49 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులన్నిటినీ జప్తు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ మద్రాసు హైకోర్టుకు తెలిపింది. జయలలితకు రూ.913 కోట్లకు పైగా ఆస్తులున్నాయని, వాటి నిర్వహణ, పర్యవేక్షణపై ఆమె ఎలాంటి వీలునామా రాయనందున హైకోర్టే పర్యవేక్షకుడిని నియమించాలంటూ చెన్నైకు చెందిన అన్నాడీఎంకే నేత పుహళేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గురువారం ఈ కేసును జస్టిస్‌ ఎంఎం సుందరేష్, జస్టిస్‌ శరవణన్‌ విచారించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శోభ కోర్టుకు హాజరై.. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని జయలలిత బంగ్లాతోపాటు తమిళనాడు, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న ఇతర ఆస్తులన్నింటినీ తమ శాఖ ఇప్పటికే జప్తు చేసినందున పర్యవేక్షణకు మరొకరిని నియమించాల్సిన అవసరం లేదన్నారు.

మరిన్ని వార్తలు