నిద్రలేమితో బాధపడిన జయలలిత

28 Sep, 2014 12:49 IST|Sakshi
జయలలిత

బెంగళూరు: నగర  శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో  అన్నా డీఎంకే అధినేత్రి జె.జయలలిత రాత్రంతా నిద్రలేమితో బాధపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ శనివారం తీర్పు చెప్పడంతో ఆమెను సెంట్రల్ జైలుకు తరలించారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడిన జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలులోని 23వ నంబర్ గదిలో జయలలిత ఒంటరిగానే ఉన్నారు.

ఇదిలా ఉండగా, జయలలిత దోషిగా తేలడంతో చెన్నైలో నిన్న ఆత్మహత్య చేసుకున్న అన్నాడిఎంకె కార్యకర్త వెంకటేశన్ మృతి చెందాడు.
**

మరిన్ని వార్తలు