జయలలిత ఆస్తుల కేసు: ఎప్పుడేం జరిగింది

27 Sep, 2014 18:03 IST|Sakshi
జయలలిత ఆస్తుల కేసు: ఎప్పుడేం జరిగింది

అనుకున్నంతా అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి, పురుచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిపోయారు. 18 ఏళ్ల నాటి ఈ కేసులో జయలలితను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు దోషిగా తేల్చి నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవిని  కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు ఈ తీర్పు విన్నవెంటనే అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో వాతావరణం తీవ్ర ఉద్రిక్త భరితంగా మారింది.

ఈకేసుకు సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి..

  • 1996 జూన్లో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు
  • విచారణ జరపాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశాలు జారీచేసింది
  • జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్లో ఛార్జిషీటు దాఖలు చేశారు
  • అక్టోబర్లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి
  • 2002 మార్చిలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు
  • 2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు
  • విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • దాంతో 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
  • 2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
  • 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు.
  • 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు
  • 2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా జి.భవానీసింగ్ నియమితులయ్యారు
  • దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాకట కోర్టు భవానీసింగ్ను తప్పించింది.
  • తనను తప్పించడంపై భవానీసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
  • ఈలోపు ప్రత్యేక కోర్టు జడ్జి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు.
  • కొత్త జడ్జిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు.
  • 2014 ఆగస్టులో విచారణ పూర్తయింది.
  • తీర్పును వాయిదా వేయాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు
  • అది కుదరదని, 27నే తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • పరపన అగ్రహారంలోని గాంధీభవన్లో ప్రత్యేక కోర్టు ఉంది.
  • 1996లో తన దత్తపుత్రుడు సుధాకర్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుచేశారన్నది ప్రధాన ఆరోపణ
  • 2014 సెప్టెంబర్ 27 వ తేదీన ఆమెకు నాలుగేళ్లు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
  • షీలా బాలకృష్ణన్ను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం.

>
మరిన్ని వార్తలు