జైలు జీవితమే దెబ్బతీసిందా?

6 Dec, 2016 16:28 IST|Sakshi
జైలు జీవితమే దెబ్బతీసిందా?

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆస్పత్రి నుంచి వస్తుందనుకున్న ‘అమ్మ’కు అస్తమించడంతో తమిళ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయారని సన్నిహితులు వాపోతున్నారు. జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని అంటున్నారు.

అక్రమాస్తుల కేసులో కోర్టు విధించడంతో 2014, సెప్టెంబర్‌ లో ఆమె జైలుకు వెళ్లారు. దాదాపు ఎనిమిది నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్య సమస్యలు తలెత్తాయని జయ సన్నిహితులు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చికిత్స​ కోసం అమెరికా వెళ్లాలని అనుకున్న జయలలిత తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. తనపై ఆరోగ్యంపై ఆమె ఆద్యంతం గోప్యత పాటించారు. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరే వరకు జయ అనారోగ్యం గురించి సన్నిహితుల తప్ప ఎవరికీ తెలియదు.

ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా కొంతమందికి తప్ప ఎవరికీ కనిపించలేదు. సెప్టెంబర్‌ 20న చెన్నై ఎయిర్‌ పోర్టు మెట్రో స్టేషన్ లో కొత్త లైను ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాధాకృష్ణన్‌ తో కలిసి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా దీన్ని ప్రారంభించారు. జయలలిత పాల్గొన్న చివరి అధికారిక కార్యక్రమం ఇదే.

మరిన్ని వార్తలు