అమ్మ ఆరోగ్యం: తమిళ టీవీ చానల్ షేర్ల లాభాలు

12 Dec, 2016 14:52 IST|Sakshi
అమ్మ ఆరోగ్యం: తమిళ టీవీ చానల్ షేర్ల లాభాలు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళన క్రమంలో స్టాక్ మార్కెట్లో  టీవీ  నెట్ వర్క్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఒకవైపు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.  మరోవైపు  అమ్మకు  కార్డియాక్   అరెస్ట్ వార్తలతో  తమిళ టీవీ చానళ్ల షేర్లకు డిమాండ్‌ పెరిగింది. దాదాపు 6- 9  లాభాలమధ్య   కొనసాగుతున్నాయి.
సన్‌ టీవీ నెట్‌వర్క్‌ షేరు 6.5  రాజ్‌ టీవీ 8.8 శాతం దూసుకెళ్లాయి.   జీ ఎంటర్ టైన్ మెంట్ 2.17శాతం, టీవీ18 0.14 శాతం, డిష్ టీవీ 1.64 శాతం నష్టపోవడం గమనార్హం.
కాగా సన్‌ టీవీ అధినేత కళానిధి మారన్‌ తమిళనాడు  ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత కరుణానిధికి మారన్‌ మునిమేనల్లుడున్న సంగతి  విదితమే.  
 

మరిన్ని వార్తలు