తొలగించలేదు... నేనే తప్పుకున్నా: జయంతి

23 Dec, 2013 00:45 IST|Sakshi
తొలగించలేదు... నేనే తప్పుకున్నా: జయంతి

న్యూఢిల్లీ: వివిధ పరిశ్రమలకు పర్యావరణ అనుమతుల మంజూరులో జాప్యం చేసినందుకే తనను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్లు వచ్చిన వార్తలను జయంతి నటరాజన్ ఆదివారం ఖండించారు. నూరు శాతం పార్టీ పనుల కోసమే తాను పదవికి రాజీనామా చేసినట్లు పునరుద్ఘాటించారు. ఇంతకుమించి మరే కారణాలు లేవన్నారు. అలాగే తన హయాంలో ప్రాజెక్టులకు అనుమతులను ఎక్కడా నిలిపేయలేదని స్పష్టం చేశారు. అయితే ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో డ్యామ్‌లు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరించిన మాట వాస్తవమేనన్నారు.
 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు