అసభ్య ప్రవర్తన... ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

23 Jan, 2016 20:39 IST|Sakshi
అసభ్య ప్రవర్తన... ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

పట్నా: బిహార్ లో అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దంపతులతో అసభ్యంగా ప్రవర్తించి వేధించారని గత ఆదివారం ఆలంపై ఆరోపణలోచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్, బిహార్  బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు అరారియా జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై చర్చిండానికి సమావేశమయ్యారు. అతని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన వారు పార్టీ నుంచి సర్ఫరాజ్ ఆలంను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జేడీయూ బిహార్ అధ్యక్షుడు వశిస్ట్ నరేన్ సింగ్ మీడియాకు ఎమ్మెల్యే సస్పెన్షన్ విషయాన్ని తెలిపారు. గత ఆదివారం గువహటి రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించారు.

అదే రైళ్లో ప్రయాణిస్తోన్న భార్యాభర్తలతో ఎమ్మెల్యే ఆలం దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై బాధితులు ఇందర్పాల్ సింగ్ బేడి, ఆయన భార్య పట్నా రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆలంతో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా తమపై చాలా అసభ్యంగా కామెంట్లు చేశారని పోలీసులకు వివరించారు. పట్నా రైల్వే ఎస్పీ పీఎన్ మిశ్రా నలుగురు సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించి బాధితులు, ప్రత్యక్షసాక్షలు నుంచి రాతపూర్వకంగా మరింత సమాచారం సేకరించినట్లు వివరించారు. ఎమ్మెల్యే ఆలం సస్పెన్షన్ పై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కూడా అనుకూలమేనని సమాచారం.

మరిన్ని వార్తలు