రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌కు చెక్‌ : జేడీయూ

13 Jun, 2019 15:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును తాము వ్యతిరేకిస్తామని, ఈ అంశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వబోమని బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ స్పష్టం చేసింది. జేడీయూ ట్రిపుల్‌ తలాక్‌ను వ్యతిరేకిస్తుందని, తమ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని ఆ పార్టీ నేత, బిహార్‌ మంత్రి షయం రజాక్‌ తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ సామాజికాంశమని, దీన్ని సమాజమే పరిష్కరించాలని చెప్సారు. కాగా ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఇప్పటికే బాహాటంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

కాగా, ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలను చర్చల ద్వారా లేదా కోర్టు తీర్పు ద్వారా పరిష్కరించాలని నితీష్‌ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతికి తాము వ్యతిరేకమని నితీష్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు