పదేళ్ల తర్వాత మహిళ అధ్యక్షతన రాజ్యసభ

3 Aug, 2018 03:59 IST|Sakshi
జేడీయూ ఎంపీ కహక్‌శాన్‌ పర్వీన్‌

న్యూఢిల్లీ: రాజ్యసభకు గత పదేళ్లలో తొలిసారి ఓ మహిళ అధ్యక్షత వహించారు. తొలిసారి ఎంపీగా సభలో కాలుపెట్టిన వ్యక్తి కావడం అధ్యక్షతవహించడం విశేషం. తొలిసారి సభ్యురాలైన జేడీయూ ఎంపీ కహక్‌శాన్‌ పర్వీన్‌ గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సభను నడిపించారు. జీరో అవర్‌ తర్వాత సభా కార్యక్రమాలను పర్వీన్‌ నడిపిస్తారంటూ రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య చెప్పారు. సభ ప్రారంభం కాగానే పర్వీన్‌ అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. దీంతో సభ్యులంతా బల్లలు చరిచి అభినందించారు. తర్వాత వెంకయ్య పర్వీన్‌ను ‘బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారం’టూ అభినందించారు. కొందరు మహిళా సభ్యులు మార్చి 8 (మహిళా దినోత్సవం సందర్భంగా)న చేసిన డిమాండ్‌ ఆధారంగా వెంకయ్య పర్వీన్‌ను వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. వైస్‌ చైర్‌పర్సన్స్‌ ప్యానెల్‌లో పర్వీన్‌ ఏకైక మహిళా అభ్యర్థి.

మరిన్ని వార్తలు