జేఈఈ(మెయిన్స్‌)కి అప్లై చేసుకోండి.

19 May, 2020 17:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ది నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్‌ 2020 కోసం ఆన్‌లైన్‌ అప్లికేషన్స్‌ని రీఓపెన్‌ చేసింది. ఇప్పటి వరకు అప్లై చేయని వారు, అప్లికేషన్‌ పూర్తిచేయని వారు ఆ ప్రక్రియ మొదలు పెట్టొచ్చు.  మే 19 నుంచి ఆప్లికేషన్లు‌లు jeemain.nta.nic.in లో అందుబాటులోకి రానున్నాయి. మే 24 సాయంత్రం 5 గంటల వరకు ఆప్లికేషన్లు ఆన్‌లైన్‌లో పెట్టుకోవచ్చు. ఫీజు మే24 రాత్రి 11:50 గంటల వరకు చెల్లించవచ్చు. (టిక్టాక్కు షాకివ్వనున్న మ్యూజిక్ కంపెనీలు!)
 

ఈ విషయం గురించి మానవవనరుల శాఖ మంత్రి రమేష్‌ పొక్రియాల్‌ ట్వీట్‌ చేస్తూ ‘జేఈఈ (మెయిన్స్) ‌ 2020 అభ్యర్థులరా,  మీ నుంచి చాలా విజ్ఞప్తులు రావడంతో,  అప్లికేషన్‌లో అభ్యర్థులకు సంబంధించిన వివరాలు మార్చుకోవడానికి, పరీక్షా కేంద్రాలు మరల ఎంపిక చేసుకోవడాని వీలు కల్పించాలని ఎన్‌టీఏ డీజీని ఆదేశించాం’ అని పేర్కొన్నారు. ఎవరైతే విదేశాల్లో చదవానలను కొని కరోనా కారణంగా ఆగిపోయారో వారికి భారత్‌లో చదవడానికి ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. అప్లికేషన్‌ పత్రాలు సమర్పించడానికి వారికి ఒక అవకాశం ఇవ్వాలని ఎన్‌టీఏ డీజేని కోరినట్లు చెప్పారు. తొందరగా అప్లికేషన్లను సమర్పించండి. మే 24 వరకు సమయం ఉంది అని పొక్రియాల్‌ ట్వీట్‌ చేశారు. (వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్!)

మరిన్ని వార్తలు