పుట్టింటికి పంపేందుకు వెరైటీ కండీషన్..!

26 Jan, 2017 21:21 IST|Sakshi
పుట్టింటికి పంపేందుకు వెరైటీ కండీషన్..!

రాంఛీ: జార్ఖండ్ తల్లిదండ్రులు తమ కుమార్తెలను రెండు రాష్ట్రాలకు తప్ప ఇతర ప్రాంతాల వాళ్లకు ఇచ్చి వివాహం చేస్తామంటున్నారు. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల అబ్బాయిలకు తమ అమ్మాయిలతో వివాహం చేస్తే.. తొలిచూరు కాన్పు అయ్యేంతవరకు పుట్టింటికి పంపించడం లేదట. దీనికి కారణం వింటే ఆశ్చర్యపోతారు. కాన్పు తర్వాత పుట్టింటికి వెళ్లిన మహిళలు కచ్చితంగా తిరిగి అత్తవారింటికి వస్తారని ఓ తాజా నివేదికలో వెల్లడైంది. పిల్లలు పుట్టకముందే భార్యను పుట్టింటికి పంపినట్లయితే, అత్తగారితో, ఆ ఇంట్లోని భర్త సోదరితో ఏదైనా గొడవ ఉంటే తిరిగి తమ ఇంటి గడప తొక్కరని హర్యానా, రాజస్థాన్ వాసుల్లో అపనమ్మకం ఏర్పడింది.

గతంలో కొంత మంది వివాహితలు గర్భవతి అవ్వకముందే పుట్టింటికి వెళ్లడం, అత్తింట్లో సమస్యలను భరించలేక తిరిగి రాకపోవడంతో ఆ రెండు రాష్ట్రాల వాళ్లు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం. ఎలాగైనా తన వివాహాన్ని ఆపాలని ఓ మైనర్ బాలిక ఎన్జీఓ ప్రతినిధికి కాల్ చేసి, తన సమస్యలను వివరించింది. తనకు తెలిసిన ఓ యువతిని రాజస్థాన్ యువకుడు వివాహం చేసుకున్నాడని, అయితే ఆమె గర్భవతి అయ్యేంత వరకు పుట్టింటికి పంపించడం లేదని తెలిపింది. దీంతో ఆ ఎన్జీఓ చేసిన సర్వేలో ఈ వివరాలు వెలుగుచూశాయి. జార్ఖండ్ ఈస్ట్ సింగ్భమ్ జిల్లా బాలికల సంక్షేమ సంఘం చైర్ పర్సన్ ప్రభా జైశ్వాల్ ఈ విషయంపై స్పందిస్తూ.. గతంలో తన దృష్టికి ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని చెప్పారు. ఆర్థిక సమస్యలతో తొందరపడి మైనర్లుగా ఉన్నప్పుడే పెళ్లి చేస్తున్నారని ఆ తర్వాత వారి కష్టాలు చూసి పేరెంట్స్ విచారిస్తున్నారని ఆమె వివరించారు.

>
మరిన్ని వార్తలు