నెహ్రూ తప్పిదం వల్లే కశ్మీర్‌లో ఉగ్రవాదం

29 Jan, 2017 02:43 IST|Sakshi

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆరోపణ
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదానికి తొలి ప్రధాని నెహ్రూ తప్పిదాలతో మొదలై 60 ఏళ్లుగా సాగిన తప్పిదాలే కారణమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆరోపించారు. ‘కశ్మీర్‌ అంశాన్ని అప్పటి హోం మంత్రి పటేల్‌కు వదిలిపెట్టి ఉంటే భారత ఉపఖండ చరిత్ర మరో విధంగా ఉండేది’ అని అన్నారు. భారత  సర్జికల్‌ దాడులు, పెద్దనోట్ల రద్దు.. పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాద నిరోధంలో నిర్ణయాత్మక చర్యలన్నారు. నోట్ల రద్దుతో ఉగ్రవాద కార్యకలాపాలు 60 శాతం, టెర్రరిస్టులకు పాక్‌ హవాలా మార్గంలో అందిస్తున్న నిధులు 50 శాతం తగ్గాయన్నారు. భారత నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న పాక్‌లోని రెండు ప్రెస్సులు మూతపడ్డాయని తెలిపారు.  
 

>
మరిన్ని వార్తలు