జేఎన్‌యూకు ప్రతిష్టాత్మక అవార్డు

11 Mar, 2016 17:31 IST|Sakshi
జేఎన్‌యూకు ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ: విద్యార్థులపై రాజద్రోహం కేసులతో అట్టుడుకుతున్న ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ( జేఎన్‌యూ) ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారం దక్కించుకుంది. 'ఉత్తమ పరిశోధన, కొత్త ఆలోచన' విభాగంలో రాష్ట్రపతి అవార్డు సొంతం చేసుకుంది. సందర్శకుల అవార్డుల్లో ప్రొఫెసర్ భట్నాగర్‌కు ఉత్తమ పరిశోధన (ఆంత్రాక్స్ వ్యాక్సిన్‌పై పరిశోధనలో), మాలిక్యులార్ పారాసిటాలజీ విభాగానికి కొత్త ఆలోచనను ప్రోత్సహించినందుకు (యాంటీ మలేరియా, అమీబియాసిస్ పరిశోధనలో) ఈ అవార్డు దక్కింది.

సందర్శకుల అవార్డుల్లో అస్సాంలోని తేజ్‌పూర్ వర్సిటీ ఉత్తమ వర్సిటీగా ఎంపికైంది. ఈ నెల 14న రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు ప్రదానం చేస్తారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు లక్ష రూపాయల నగదు అందజేస్తారు.

మరిన్ని వార్తలు