పోరుకు సిద్ధమంటున్న ఉమర్ సోదరి

19 Mar, 2016 20:50 IST|Sakshi
పోరుకు సిద్ధమంటున్న ఉమర్ సోదరి

న్యూఢిల్లీ: గిలానీ, నక్సల్స్‌లతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని రాజద్రోహంలో కేసులో నిందితుడైన జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ సోదరి 11 ఏళ్ల సారా ఫాతిమా తెలిపింది. బెయిల్‌పై విడుదలైన తన సోదరుడు ఉమర్, అనిర్బన్‌లకు శనివారం జేఎన్ యూ వర్సిటీలో మిగతా విద్యార్థులతో కలిసి ఆమె స్వాగతం పలికింది.

ఈ సందర్భంగా సారా ఫాతిమా మాట్లాడుతూ తన సోదరుడు విడుదల కావటం శుభపరిణామం అంటూ, అన్యాయంపై పోరాడతాం...  ‘లాల్ సలామ్’, ‘ఆజాదీ‘ అంటూ నినాదాలు చేసింది. ఆమె ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరోవైపు రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన మాజీ ప్రొఫెసర్ ఎస్‌ఏఆర్ గిలానీ కి కూడా ఢిల్లీ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.

కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిలుపై విడుదలయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఈ ఇద్దరు విద్యార్థులకు ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు