‘షెల్టర్‌ కల్పిస్తామంటే చర్యలు తప్పవు’

29 Feb, 2020 17:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సరవణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా, అనుకూలంగా జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 42 మంది మరణించగా, వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ క్యాంపస్‌లో అల్లర్ల బాధితులకు ‘షెల్టర్‌’ కల్పిస్తామని విద్యార్ధి సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలపై విశ్వవిద్యాలయ వీసీ జగదీష్‌ కుమార్‌ స్పందించారు. ‘ఢిల్లీలోని ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలని కోరుకుంటున్నాము. బాధితులకు సాధ్యమైనంత సాయం అందించాలనుకుంటున్నాం. కానీ, క్యాంపస్‌లోని కొన్ని విద్యార్థి సంఘాలు క్యాంపస్‌కు సంబంధంలేని వ్యక్తులకు ‘షెల్టర్‌’ కల్పిస్తామని ప్రకటిస్తున్నాయి. క్యాంపస్‌కు సంబంధంలేని వ్యక్తులు యూనివర్సిటీలోకి పవేశించటం వల్ల జనవరిలో హింసాత్మక ఆందోళనలు జరిగాయని విద్యార్థులు నిరసనలు తెలిపిన విషయాన్ని వీసీ జగదీష్‌ కుమార్‌ గుర్తు చేశారు. (కల్లోలం నుంచి క్రమంగా.. 148 ఎఫ్‌ఐఆర్‌లు)

అల్లర్లలో బాధపడే వారికి సాయం చేయడం వల్ల ఎలాంటి హాని జరగనప్పటికి విశ్వవిద్యాలయ శాంతి, భద్రతల దృష్ట్యా బాధితులకు ‘షెల్లర్‌’ ఇవ్వకూడదని ఆయన తెలిపారు. దీనిపై విద్యార్థులు ఎంటువంటి ప్రకటనలు చేయొద్దని ఆయన కోరారు. అదేవిధంగా చట్టపరంగా క్యాంపస్‌లో ‘షెల్టర్‌’ ఇవ్వాలని ఎటువంటి నిబంధన లేదన్నారు. అయిన్పటికీ విద్యార్థి సంఘాలు యూనివర్సిటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వీసీ జగదీష్‌ కుమార్‌ తెలిపారు.(ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి)

మరిన్ని వార్తలు