నడిరోడ్డులో జర్నలిస్ట్‌పై కాల్పులు

21 Jul, 2020 10:03 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. తన మేనకోడలిని వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల తరువాతే ఇలా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న విక్రమ్‌ జోషిని ఘజియాబాద్‌లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు . విక్రమ్ జోషి, సోమవారం రాత్రి తన కుమార్తెతో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చదవండి: నెల క్రితం వివాహం.. వధువు మృతి

విక్రమ్‌జోషి మేనకోడలితో  కొంతమంది అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించారు.  దీంతో వారిపై విక్రమ్‌ పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో తమ మేనకోడలిని ఏడిపించిన దుండగులే ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారాని విక్రమ్‌ జోషి సోదరుడు తెలిపాడు. కాల్పుల్లో విక్రమ్‌ జోషి తలకు బులెట్‌ తగిలింది. వెంటనే  అతనిని ఘజియాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి ఇంత వరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదని విక్రమ్‌జోషి సోదరుడు తెలిపాడు. దీనిపై స్పందించిన పోలీసులు విజయ్‌నగర్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందినట్లు సీనియర్‌ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. దవండి: అత్తింటి వేధింపులకు వివాహిత బలి

>
మరిన్ని వార్తలు