‘తీర్పు ఇవ్వడానికి జడ్జిలకు మనసుండాలి’

6 Oct, 2016 17:14 IST|Sakshi

న్యూఢిల్లీ: కేవలం మెదడుతో చేసే పనివల్ల న్యాయమూర్తులు ప్రజలకు న్యాయం చేయలేరనీ, వారికి మనసుండాలనీ, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనిల్‌ ఆర్‌ దవే అన్నారు. బుధవారం జరిగిన జస్టిస్‌ వి.గోపాల గౌడ వీడ్కోలు సభలో ఆయన ఈ మాటలన్నారు. గోపాల గౌడ మనసుతో తీర్పులిచ్చిన న్యాయమూర్తి అని ప్రశంసించారు. కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు బార్‌ అసోషియేషన్‌ (ఎస్‌సీబీఏ) నిర్వహించింది.

జస్టిస్‌ గౌడ మాట్లాడుతూ రైతుల హక్కులను పరిరక్షించాలని యువ న్యాయవాదులను కోరారు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే రైతులే కారణమనీ, నష్టాలు వస్తున్నా ఏ ప్రతిఫలం ఆశించకుండా తిండి గింజలు పండిస్తున్న అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన ఇతర న్యాయమూర్తులను అభ్యర్థించారు. 2012లో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చిన గౌడ బుధవారం పదవీ విరమణ చేశారు.

మరిన్ని వార్తలు