జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?

31 Oct, 2016 13:36 IST|Sakshi
జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?
జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆరోపణలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెంటనే ఖండించారు. ''ఫోన్లో మాట్లాడొద్దు, అవి ట్యాప్ అవుతున్నాయి'' అంటూ ఇద్దరు జడ్జీలు మాట్లాడుకోవడం తాను విన్నానని, ఇలా జడ్జీల ఫోన్లను ట్యాప్ చేయడం సరికాదని కేజ్రీవాల్ చెప్పారు. అది నిజమో కాదో తనకు తెలియదు గానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా జరిగితే అసలు న్యాయవ్యవస్థకు స్వాతంత్ర్యం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా జడ్జి ఏదైనా తప్పు చేసినా, అప్పుడు కూడా వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయకూడదని.. సాక్ష్యాలు సేకరించడానికి ఇంకా చాలా రకాల మార్గలున్నాయని కేజ్రీవాల్ అన్నారు. 
 
అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ఇప్పటివరకు జడ్జీల ఫోన్లను అసలు ట్యాప్ చేయలేదన్న విషయాన్ని తాను కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు. 
మరిన్ని వార్తలు