న్యాయమూర్తులకూ త‌ప్ప‌ని లాక్‌డౌన్ క‌ష్టాలు

26 Apr, 2020 11:38 IST|Sakshi

కోల్‌క‌తా: లాక్‌డౌన్ క‌ష్టాలు న్యాయమూర్తులకూ త‌ప్ప‌లేదు. ప్ర‌ధాన న్యాయమూర్తిగా ప‌ద‌వీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇద్ద‌రు జడ్జ్‌లు సుమారు 2వేల కి.మీ. ప్ర‌యాణించారు. ఈ ఘ‌ట‌న దేశంలో రెండు వేర్వేరు ప్ర‌దేశాల్లో చోటు చేసుకుంది. క‌ల‌క‌త్తా హైకోర్టులో న్యాయ‌వాదిగా ప‌నిచేస్తున్న దీపాంక‌ర్ ద‌త్తాకు బాంబే హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఎంపిక‌య్యారు. దీంతో ఆయ‌న‌ ఉన్న‌ఫ‌ళంగా శ‌నివారం కోల్‌క‌తాను వ‌దిలి కుటుంబంతో స‌హా ముంబైకు ప‌య‌న‌మ‌య్యారు. సుమారు 2 వేల కి.మీ.కు పైగా ప్ర‌యాణం అనంత‌రం సోమ‌వారం మ‌ధ్యాహ్నానికి ఆర్థిక రాజ‌ధానిలో అడుగు పెట్ట‌నున్నారు. మ‌రోవైపు అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా ప‌‌నిచేస్తున్న బిశ్వ‌నాథ్ సోమద్ధ‌ర్ మేఘాల‌య హైకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. (పోలీసు నుంచి మంత్రికి సోకిన కరోనా)

ఇందుకోసం కోల్‌క‌తా మీదుగా షిల్లాంగ్‌కు ప‌య‌న‌మ‌య్యారు. తొలుత ఆయ‌న‌ కోల్‌క‌తా హైకోర్టులో సేవ‌లందించారు. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి అల‌హాబాద్‌కు బ‌దిలీ అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న సీజేగా బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు శుక్ర‌వారం త‌న భార్య‌తో క‌లిసి కారులో బ‌య‌లుదేరారు. రెండు రోజుల అలుపెర‌గ‌ని ప్రయాణం అనంత‌రం నేడు మ‌ధ్యాహ్నానికి ఆయ‌న షిల్లాంగ్‌కు చేరుకోనున్నారు. కాగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింగ్ గురువారం వీరిద్ద‌రూ ఆయా హైకోర్టుల్లో సీజేగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించాలంటూ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. (జ‌డ్జికి క‌రోనా రానూ: లాయ‌ర్ శాప‌నార్థం)

మరిన్ని వార్తలు