న్యాయాధికారుల విభజన కేసులో కీలక మలుపు

14 Nov, 2017 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల కేడర్‌ విభజన కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను చేపట్టిన బెంచ్‌ నుంచి జస్టిస్‌ చలమేశ్వర్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ నజీర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. 

ఈ కేసు తుది దశలో ఉండగా కేసు విచారణ చలమేశ్వర్‌ తప్పుకోవటం విశేషం. కాగా, క్యాడర్‌ విభజనకు సంబంధించి 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రమే మార్గదర్శకాలు రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. గతంలో తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యల్లో కేంద్రం పోషిస్తున్న పాత్ర గురించి వివరించింది.

అయితే హరేన్‌రావెల్‌ విభజన చట్టంలోని సెక్షన్లు ప్రస్తావించిన సమయంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ స్పందిస్తూ..''హడావుడిగా చట్టం రూపొందించడం వల్ల సమస్యలు ఇలాగే తలెత్తడంతోపాటు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి'' అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా విభజన చేపట్టాలన్న యత్నాలు మొదలయ్యే లోపు ఆయన తప్పుకున్నారు.

మరిన్ని వార్తలు