బదిలీపై ముందే తెలుసు: జస్టిస్‌ మురళీధర్‌

6 Mar, 2020 07:56 IST|Sakshi
వీడ్కోలు సమావేశంలో జస్టిస్‌ మురళీధర్‌

ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్‌.మురళీధర్‌ తన బదిలీపై స్పష్టతనిచ్చారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరును ప్రశ్నించి రాత్రికి రాత్రే బదిలీ అయిన ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్‌.మురళీధర్‌ తన బదిలీపై స్పష్టతనిచ్చారు. బదిలీ విషయం ముందే తెలుసని చెప్పారు. పంజాబ్, హరియణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఢిల్లీలో గురువారం ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, లాయర్లు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్జి మురళీధర్‌ మాట్లాడారు. ‘సత్యం వైపు నిలవండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది’ అని పేర్కొన్నారు. (అర్థరాత్రి విచారణ.. ఆ న్యాయమూర్తి బదిలీ)

తన బదిలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందస్తుగానే సమాచారం అందించారని, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతోనే పంజాబ్‌–హరియాణా కోర్టుకు బదిలీ చేశారని తెలిపారు. ఫిబ్రవరి 26న తన బదిలీ ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకలు అనురాగ్‌ ఠాకూర్, పర్వీష్‌ వర్మ, కపిల్‌ మిశ్రాలపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించిన మురళీధర్‌ను కేంద్రం బదిలీ చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. (చదవండి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ బదిలీ ఓ శేష ప్రశ్న!)

మరిన్ని వార్తలు