అన్ని చీకటి రాత్రుల్లాగే ఇదీ గడిచిపోతుంది..! 

5 Jun, 2020 03:56 IST|Sakshi

అవరోధాల మధ్య మనం పనిచేయాల్సి ఉంది

‘నల్సా’ హాండ్‌బుక్‌ ఆవిష్కరణలో జస్టిస్‌ ఎన్వీ రమణ

సాక్షి, న్యూఢిల్లీ: సవాళ్లతో కూడిన ఈ క్లిష్టకాలం మనల్ని అచేతనులుగా మార్చేలా చేయనివ్వొద్దని, అన్ని చీకటి రాత్రుల వలె ఇదీ గడిచిపోతుందని జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ప్రభావవంతమైన న్యాయ సేవలు అందించే లక్ష్యంతో కామన్‌వెల్త్‌ హ్యూమన్‌రైట్స్‌ ఇన్షియేటివ్‌ (సీహెచ్‌ఆర్‌ఐ) సహకారంతో నల్సా రూపొందించిన హాండ్‌ బుక్‌ను జస్టిస్‌ ఎన్వీ రమణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల న్యాయ సేవల ప్రాధికార సంస్థల ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్లు, మెంబర్‌ సెక్రటరీలు, హైకోర్టు న్యాయసేవల కమిటీల చైర్మన్లు, జిల్లా న్యాయ సేవల సంస్థల చైర్మన్లు, సెక్రటరీలతో నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘3 నెలలు గడిచినా ఇంకా పరిస్థితి నియంత్రణలో లేదు. లాక్‌డౌన్‌ కారణంగా వేలాది మంది జీవనోపాధి కోల్పోయారు. మానసిక సమస్యలు తలెత్తాయి.  పిల్లలు బడికి వెళ్లలేని పరిస్థితి. మనం కొన్ని అవరోధాల మధ్య పనిచేయాల్సి ఉంది.  సుప్రీంకోర్టు, హైకోర్టులు వీడి యో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కేసులు విచారిస్తున్నాయి. కుటుంబాల్లో హిం సాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మా దృష్టికి వచ్చింది. చిన్న పిల్లలపై దాడులు పెరిగిపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలో బాధితులు మనల్ని చేరలేరు. ఈ పరిస్థితిని గుర్తించి వన్‌ స్టాప్‌ సెంటర్లు (ఓఎస్సీ) ఏర్పాటుచేశాం. ప్రతి జిల్లాలో మహిళా న్యాయవాదుల ద్వారా టెలిఫోన్‌లో న్యాయసేవలు అందించేందుకు చర్య లు తీసుకున్నాం’అని వివరించారు.

మరిన్ని వార్తలు