సుప్రీం చీఫ్‌ జస్టిస్‌గా రంజన్‌ గొగోయ్‌

3 Oct, 2018 11:07 IST|Sakshi

46 చీఫ్‌ జస్టిస్‌గా గొగోయ్‌

సాక్షి, న్యూఢిల్లీ : భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జస్టిస్‌ గొగోయ్‌చే 46వ చీఫ్‌ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గొగోయ్‌ దేవుడిపై ప్రమాణం చేశారు.

అసోం వాసి అయిన గొగోయ్‌.. ఈశాన్య రాష్ట్రాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన ఈ పదవిలో 2019 నవంబర్‌ వరకు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవగౌడ, పలవురు కేంద్రమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

చదవండి: జ్యుడీషియల్‌ యాక్టివిజానికి సై...!

>
మరిన్ని వార్తలు