సీజేఐ బాటలో జస్టిస్‌ ఏకే సిక్రీ

24 Jan, 2019 15:43 IST|Sakshi
జస్టిస్‌ ఏకే సిక్రీ

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్‌. నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే బెంచ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ గురువారం ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్‌ను శుక్రవారం ఈ మరో బెంచ్‌ విచారించనుంది. ‘ఈ పిటిషన్‌ను విచారించలేను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోవాల’ని పిటిషనర్‌ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవేతో జస్టిస్‌ సిక్రీ పేర్కొన్నారు. (‘సీబీఐ’ కేసు నుంచి తప్పుకున్న సీజేఐ)

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను తప్పించి ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగేశ్వరరావును నియమించాలని జనవరి 10న నిర్ణయం తీసుకున్న ఉన్నతస్థాయి కమిటీలో జస్టిస్‌ సిక్రీ కూడా ఉన్నారు. బెంచ్‌ నుంచి జస్టిస్‌ సిక్రీ తప్పుకోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని దుష్యంత్‌ దవే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఇప్పటికే బెంచ్‌ నుంచి తప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు జస్టిస్‌ సిక్రీ కూడా వైదొలగడంతో ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా లేదన్న భావన ప్రజల్లో కలిగే అవకాశముందన్నారు.

మరిన్ని వార్తలు