కరోనా బారిన పడిన జ్యోతిరాదిత్య సింధియా

9 Jun, 2020 16:01 IST|Sakshi

న్యూఢిల్లీ‌: బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆయన తల్లి మాధవి రాజే సింధియా కరోనా వైరస్(కోవిడ్‌-19)‌ బారిన పడ్డారు. వైరస్‌ లక్షణాలతో బాధ పడుతున్న వారిరువురికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వాళ్లిద్దరికి దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌లో గల మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రాలో కూడా కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనను గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం ఆయనను డిశ్చార్జ్‌ చేశారు.(ఢిల్లీలో జులై 31 నాటికి 5.5 లక్షల కేసులు!)

మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఢిల్లీలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. దేశ రాజధానిలో ఇప్పటివరకు మొత్తం దాదాపు 30వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు