మద్య నిషేధానికి కమల్‌ విముఖత

1 Mar, 2018 17:27 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, చెన్నై : మద్యనిషేధం సమాజానికి మేలు కంటే ఎక్కువగా చేటు చేస్తుందని..తాను సంపూర్ణ మద్యనిషేధానికి వ్యతిరేకమని ఇటీవల రాజకీయ ఎంట్రీ ఇచ్చిన నటుడు కమల్‌ హాసన్‌ చెప్పారు. తమిళనాడులో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి ఉచిత వరాలు గుప్పించనని చెప్పుకొచ్చారు. అయితే విచ్చలవిడిగా మద్యం దుకాణాలను అనుమతించరాదని అన్నారు.

తమిళనాడులో పోస్ట్‌ఆఫీస్‌ కోసం వెతకాల్సిన అవసరం ఉంది కాని మద్యం మాత్రం ఏరులైపారుతోందని..ఈ పరిస్థితిని మనం మార్చాలని కమల్‌ చెప్పారు. తమిళనాడులో పలు విపక్ష పార్టీలు మద్యనిషేధం విధించాలని గళమెత్తిన నేపథ్యంలో కమల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే మద్యం మాఫియా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ పత్రిక ఆనంద వికటన్‌లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

మరిన్ని వార్తలు