ఆసుపత్రిలో కమల్‌, రేపు సర్జరీ

21 Nov, 2019 12:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు  వైద్యులు శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక​ ప్రకటన  విడుదల చేసింది. 2016 లో జరిగిన ప్రమాదంలో  కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, దీన్ని తొలగించాల్సి అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్‌ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహా మేరకు  రేపు (నవంబర్ 22) కమల్ హాసన్ ఇందుకోసం ఆసుపత్రిలో చేరనున్నారని తెలిపారు.  ఈ నేపథ్యంలో ఆయన కోలుకునేందుకు కొన్ని వారాలు పాటు విరామం తీసుకోవాల్సి వుంటుందని  మహేంద్రన్‌ వెల్లడించారు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

8న అన్ని పార్టీల సభాపక్ష నేతలతో మోదీ భేటీ 

గృహ హింసకు ఎర్ర చుక్క పరిష్కారం 

దీపాలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు

గ్రిడ్‌ కుప్పకూలే అవకాశమే లేదు

లాక్‌డౌన్‌ దశలవారీగా సడలింపు!

సినిమా

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు