సుప్రీంకోర్టును ఆశ్రయించిన కన్హయ్య

18 Feb, 2016 16:07 IST|Sakshi
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కన్హయ్య

న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కన్హయ్య కుమార్ తరపున వృందా గ్రోవర్ ఈ పిటిషన్ సమర్పించారు. పటియాలా కోర్టులో పిటిషన్ వేసే పరిస్థితులు లేనందున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. ఆర్టికల్ 32 కింద బెయిల్ కోసం కన్హయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. దీనిపై రేపు(శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ అభయ మనోహర్ లతో కూడిన బెంచ్ పేర్కొంది.

కాగా, కన్హయ్య కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే తాము అడ్డుకోబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ నిన్న ప్రకటించారు. మార్చి 2 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కన్హయ్య కుమార్ ను నిన్న తీహార్ జైలుకు తరలించారు.

>
మరిన్ని వార్తలు